Wednesday, March 4, 2026
E-PAPER
Homeసినిమా'ఆయా షేర్‌' సాంగ్‌కి సూపర్‌ రెస్పాన్స్‌

‘ఆయా షేర్‌’ సాంగ్‌కి సూపర్‌ రెస్పాన్స్‌

- Advertisement -

హీరో నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్‌’. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించారు. ఈ చిత్రం ఆగస్టు 21న వరల్డ్‌ వైడ్‌ రిలీజ్‌ కానుంది. ప్రస్తుతం ‘ఆయా షేర్‌’ ప్రపంచవ్యాప్తంగా టాప్‌లో ట్రెండ్‌ అవుతూ భారీ రెస్పాన్స్‌ అందుకుంటుంది. ఈ సందర్భంగా ‘ఆయా షేర్‌’ సాంగ్‌ కొరియోగ్రాఫర్‌ సుధన్‌ మాస్టర్‌ మీడియాతో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో అవకాశం రావడానికి మొదటి కారణం దర్శకుడు శ్రీకాంత్‌. ‘ఆయా షేర్‌’ పాట ఇది వరకు ఎన్నడూ కూడా చూడని విధంగా ఉండాలని దర్శకుడు క్లియర్‌గా చెప్పారు. ఇది ఒక రూటేడ్‌ ఏరియాలో జరుగుతున్న స్టోరీ. ఆ ఏరియాలో ఉన్న ప్రజలకి ఒక ధైర్యాన్ని ఇచ్చే క్యారెక్టర్‌.

ఈ క్యారెక్టర్‌ని ఈ పాటలో చూపించాం. ఈ సాంగ్‌ మొత్తంలో ఒక ఆటిట్యూడ్‌ క్యారీ చేయాలని, సిచ్చ్యువేషన్‌ క్లారిటీగా చెప్పిన తర్వాతనే కొరియోగ్రఫీ మొదలు పెట్టాను. అలాగే నాని ఇప్పటివరకు చేయని ఒక క్యారెక్టర్‌ చేస్తున్నారు. ఇంట్రో సాంగ్‌ చాలా ఇంపార్టెంట్‌ అని కూడా మైండ్‌లో పెట్టుకున్నాను. అనిరుధ్‌, సింగర్స్‌, లిరిక్‌ రైటర్‌ అందరూ కలిసి అద్భుతమైన సాంగ్‌ ఇచ్చారు. డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ అందరు సలహాలు తీసుకుని ఒక ఎడిట్‌ వర్షన్‌ డైరెక్టర్‌కి చూపించాను. ఆయనకి చాలా నచ్చింది. హుక్‌ స్టెప్‌ అద్భుతంగా కుదిరింది. అలాగే ఇందులో మూమెంట్స్‌ అన్నీ నాని క్యారెక్టర్‌లోనే ఉన్నాయి. ఇందులో హుక్‌ స్టెప్‌ కోసం మూడు రోజులు రిహార్సల్స్‌ చేశాం. మా గురువు ప్రేమ్‌ రక్షిత్‌ మాస్టర్‌ ఈ సాంగ్‌ చూసి చాలా హ్యాపీగా ఫీల్‌ అయ్యారు. ఇండస్ట్రీలో శిష్యుడుగా నీ పేరు చెప్తా అన్నారు’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -