Wednesday, March 4, 2026
E-PAPER
Homeసినిమానా పేరు గుర్తుపెట్టుకుంటారు

నా పేరు గుర్తుపెట్టుకుంటారు

- Advertisement -

శ్రీనాథ్‌ మాగంటి హీరోగా బాల సతీష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మెన్షన్‌ హౌస్‌ మల్లేష్‌’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్స్‌. కనకమేడల ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ పై రాజేష్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈనెల 6న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా హీరో శ్రీనాథ్‌ మాగంటి మీడియాతో మాట్లాడుతూ, ‘ఒక పొగరుబోతు, దారితప్పి లేనిపోనీ అలవాట్లుతో ఉన్న ఓ క్యారెక్టర్‌ని అతని తల్లి, భార్య ఎలా దారిలోకి తీసుకొస్తారనేది చాలా సరదాగా చెప్పాం. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనింగ్‌ కామెడీ జోనర్‌ ఫిల్మ్‌. ఫ్యామిలీ అంతా కలసి నవ్వుకునే సినిమా. ఈ సినిమాలో నన్ను నేను కొత్తగా చూపించుకోడానికి ఒక అవకాశం దొరికింది. ఈ పాత్ర కోసం కొన్ని రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్స్‌ని అబ్జర్వ్‌ చేశాను. అలాగే మా అమ్మ పాత చున్నితో చొక్కాగా కుట్టించుకుని వేసుకున్నాను.

మల్లేష్‌ని చూపించడానికి నేను చాలా మారాల్సి వచ్చింది. ఈ సినిమాతో ఆడియన్స్‌ నా పేరు గుర్తుపెట్టుకుంటారని నమ్ముతున్నాను. దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ట్రైలర్‌ లాంచ్‌ చేశారు. ఆయనకు చాలా నచ్చింది. ట్రైలర్‌ చూసినంత సేపు నవ్వుకుంటున్నారు. సినిమా కూడా థియేటర్స్‌లో చూస్తానని చెప్పారు. డైరెక్టర్‌ బాల సతీష్‌కి ఇది ఫస్ట్‌ సినిమా. ఆయన చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్‌. ఈ సినిమాతో ఆయన మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. ఇది యూనివర్సల్‌ సబ్జెక్టు. కాకపోతే తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. నిర్మాత రాజేష్‌ అమెరికా నుంచి సినిమా అంటే చాలా ప్యాషన్‌తో వచ్చారు. సినిమా విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. ఆయన ఈ సినిమాలో నటించారు. అలాగే కొన్ని డైలాగ్స్‌ కూడా రాశారు’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -