హీరో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబోలో రాబోతున్న పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈచిత్రానికి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం సమకూరుస్తున్నారు. తాజాగా మేకర్స్ రెండో సింగిల్ ‘రై రై రా రా’ను విడుదల చేశారు. ఏఆర్ రెహ్మాన్ స్వయంగా ఆలపించిన ఈ పవర్ఫుల్ డ్యాన్స్ నెంబర్ పల్సేటింగ్ బీట్స్, ఇన్ఫెక్షియస్ రిథమ్‌తో అదిరిపోయే మాస్ ఎనర్జీని అందిస్తోంది. రామ్ చరణ్ తన ట్రేడ్‌మార్క్ మాస్ ఎనర్జీ, గ్రేస్‌ఫుల్ ఫిట్నెస్తో అదరగొట్టారు. ఈ పాట గురించి చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘రై రై..రారా’ సాంగ్ స్క్రీన్‌పై ఓ ఫైర్‌లా ఉంది. అది ఎనర్జీ, ఎమోషన్లతో కూడిన ఓ అద్భుతం. చరణ్ గ్రేస్, డ్యాన్స్‌లో వేగం చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది.
సంగీత దర్శకుడు రెహ్మాన్, గీత రచయిత అనంత్ శ్రీరామ్, కొరియోగ్రాఫర్ జానీ, దర్శకుడు బుచ్చిబాబు, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, నిర్మాత వెంకట సతీష్ కిలారును ప్రత్యేకంగా అభినందిస్తున్నాను’ అని చిరు పేర్కొన్నారు. దీనికి రిప్లై ఇస్తూ దర్శకుడు బుచ్చిబాబు, ‘ఆ రోజు ఇంకా గుర్తుంది సార్.. ఈ పాటలోని బీజీఎం షూటింగ్ చేస్తున్నప్పుడు చరణ్‌కు తీవ్ర జ్వరం. మేం షూటింగ్ ఆపేద్దామన్నా..చరణ్ వినలేదు. అంత జ్వరంలోనూ చిరునవ్వుతో, ఎంతో గ్రేస్‌తో డ్యాన్స్ చేశారు. ఆ డెడికేషన్ అన్నీ మీ నుంచి వచ్చినవే సార్’ అని తెలిపారు. ఏప్రిల్ 30న ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఫైర్‌లా ఉంది..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



