2004లో హెచ్‌సీఏతో కుదర్చుకున్న ఒప్పందం ప్రకారం విశాఖ సంస్థ రూ.4.32 కోట్లను చెల్లించింది. ప్రతిగా, ఉప్పల్ స్టేడియంలో నిర్వహించే అంతర్జాతీయ మ్యాచ్‌ల ప్రకటనల ఆదాయం హక్కులతో పాటు స్టేడియానికి విశాఖ పేరు పెట్టాలని షరతు విధించింది. శివలాల్ యాదవ్ సారథ్యంలోని హెచ్‌సీఏ పెద్దలు.. విశాఖ షరతులకు అంగీకరించి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం అంతర్జాతీయ మ్యాచ్‌లకు మాత్రమే జరుగగా, ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ప్రకటనల హక్కులు విశాఖ సంస్థకు చెందని అప్పటి హెచ్‌సీఏ అధ్యక్షుడు అర్షద్ అయూబ్ ఒప్పందాన్ని రద్దు చేశాడు. ఐపీఎల్ మ్యాచ్‌లకు ప్రాంఛైజీలే నేరుగా ప్రకటనల ఆదాయం ఆర్జించటంతో.. ఆ నష్టాన్ని హెచ్‌సీఏ ఖజానా నుంచి విశాఖకు చెల్లించారు.
ఇది హెచ్‌సీఏపై అదనపు భారంగా పడింది. దీంతో క్రికెట్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అర్షద్ అయూబ్ ఒప్పందాన్ని రద్దు చేశారు. రద్దు నిర్ణయాన్ని విశాఖ సంస్థ న్యాయస్థానంలో సవాల్ చేయగా, వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. మధ్యవర్తిత్వంతో వివాదం పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ.. హెచ్‌సీఏ ఆ పని చేయకుండా విశాఖకు రూ.68.73 కోట్ల చెల్లింపులకు మొగ్గుచూపింది. విశాఖతో ఒప్పందం రద్దు తర్వాత అర్షద్ అయూబ్‌తో పాటు జి. వినోద్, జి. వివేక్, అనిల్ కుమార్, అజహరుద్దీన్, జగన్మోహన్ రావులు హెచ్‌సీఏ అధ్యక్షులుగా పని చేశారు. హెచ్‌సీఏ ప్రయోజనాలు కాపాడుతూ, ఖజానా లూటీని అడ్డుకునేందుకు కృషి చేసి అర్షద్ అయూబ్‌ను.. తాజా ఆఫీస్ బేరర్లు బాధ్యుడిని చేసే ప్రయత్నం చేశారు. హెచ్‌సీఏ ఇచ్చిన వివరణ నోట్లో అర్షద్ అయూబ్ రద్దు చేయటంతోనే ఈ నష్టం వాటిల్లిందని పేర్కొనటం గమనార్హం.
అర్షద్ అయూబ్‌పై నెపం?
- Advertisement -
- Advertisement -



