- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను సినీనటి, టీచ్ ఫర్ ఛేంజ్ ట్రస్ట్ ఫౌండర్ మంచు లక్ష్మి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 27న నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి హాజరుకావాలని మంత్రి సీతక్కను ప్రజాభవన్లో కలిసి ఆహ్వానించారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విద్యాబోధనకు సహకారం అందిస్తున్నామని, స్కూళ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు మంచు లక్ష్మి వివరించారు. పేద విద్యార్థుల చదువు కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం గొప్ప విషయమని మంత్రి సీతక్క మంచు లక్ష్మిని అభినందించారు.
- Advertisement -



