- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లులో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి జాతరలో అపశృతి చోటు చేసుకుంది. నిప్పుల గుండం దాటుతుండగా భక్తుల మధ్య ఒక్కసారిగా తోపులాట జరిగి, ఒకరినొకరు నెట్టుకోవడంతో పలువురు భక్తులు నిప్పుల గుండంలో పడ్డారు.
ఈ ఘటనలో సుమారు 10 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు అప్రమత్తమై నిప్పుల్లో పడిపోతున్నవారిని బయటికి లాగి, గాయపడినవారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
- Advertisement -



