Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభ బండ్లు సంప్రదాయానికి ప్రతీక: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

ప్రభ బండ్లు సంప్రదాయానికి ప్రతీక: ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

- Advertisement -

నవతెలంగాణ – గీసుగొండ : శ్రీ కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్న ప్రభ బండీని కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే రేవూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభ బండ్లు  మన సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తున్నాయని తెలిపారు. ఆనవాయితీగా వస్తున్న ఈ ఆచారాన్ని భక్తి భావంతో కొనసాగించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖా సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్పూర్తిగా ఆకాంక్షించారు. ప్రభ బండ్లు నిర్వహిస్తున్న నిర్వాహకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

అదేవిధంగా జాతర నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. భక్తి భావంతో ముందుకు సాగి స్వామివారి దర్శనం చేసుకుని ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ప్రసంగంతో ఆయన అనుచరుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమంలో పరకాల అధికార ప్రతినిధి చల్లా కొమరారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు తుమ్మనపల్లి శ్రీనివాస్, మాజీ ఎంపీపీ భీమగాని సౌజన్య, కొమ్ము శ్రీకాంత్, ఏఎంసీ డైరెక్టర్ ఆకుల ప్రసాద్, కూసం రమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -