నవతెలంగాణ-హైదరాబాద్: నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ బుధవారం న్యూఢిల్లీ చేరుకున్నారు. విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ విమానాశ్రయంలో స్టబ్కు ఘన స్వాగతం పలికారు. ఫిన్లాండ్ అధ్యక్షుని వెంట మంత్రులు, సీనియర్ అధికారులు మరియు వ్యాపారనేతలతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం ఉంది. ఆయన గురువారం ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. వాణిజ్యం, పెట్టుబడి మరియు కీలకమైన సాంకేతికత సహా విస్తృత రంగాల్లో సహకారాన్ని పెంపొందించేందుకు ఇరు దేశాలు పలు అవగాహనా ఒప్పందాలను (ఎంఒయు) కుదుర్చుకోనున్నాయి. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపాధ్యక్షుడు సి.పి.రాధాకృష్ణన్లతో కూడా సమావేశం కానున్నారు. గురువారం సాయంత్రం రైసినా డైలాగ్ ప్రారంభ సమావేశంలో అలెగ్జాండర్ స్టబ్ ముఖ్య అతిథిగా పాల్గననున్నారు. శుక్రవారం ముంబయిలో వ్యాపారవేత్తలతో సమావేశం కానున్నారు. ఇటీవల ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ కోసం ఫిన్లాండ్ ప్రధాని పెట్టెరి ఒర్పో భారత్లో పర్యటించిన సంగతి తెలిసిందే.
భారత్కు చేరుకున్న ఫిన్లాండ్ అధ్యక్షుడు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



