Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి

38వ వార్డులో దొంగ ఓట్లపై విచారణ జరపాలి

- Advertisement -

 – రీపోలింగ్‌కు డిమాండ్
– మూడు ఓట్ల తేడాతో ఓటమి.. జిల్లా కోర్టును ఆశ్రయించిన రంగా మాధవి
నవతెలంగాణ –  కామారెడ్డి

కామారెడ్డి మున్సిపల్ ఎన్నికల్లో 38వ వార్డులో దొంగ ఓట్లు నమోదయ్యాయని, మొత్తం 200 వరకు అక్రమ ఓట్లు పడ్డాయని కాంగ్రెస్ పార్టీ 38 వార్డు అభ్యర్థి రంగా మాధవి ఆరోపించారు. కేవలం మూడు ఓట్ల మెజారిటీతో ఓడిపోవడం బాధాకరమని పేర్కొంటూ 38వ వార్డులో రీపోలింగ్ నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. సమీప అభ్యర్థి ఇప్ప ఉమారాణి మూడు ఓట్ల తేడాతో గెలుపొందారని తెలిపారు.

మొత్తం 1149 ఓట్లు పోలవ్వగా అందులో 200 వరకు దొంగ ఓట్లు ఉన్నాయని ఆరోపించారు. తమ కాలనీలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ప్రముఖులు పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వకుండా స్వతంత్ర అభ్యర్థికి సపోర్ట్ చేశారని, ఓటర్లకు ఫోన్ చేసి కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దని సూచించారని పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు రెండు చోట్ల ఓట్లు వేశారని ఆరోపిస్తూ, రాజంపేట ఉప సర్పంచ్ ఇమ్రాన్ అలీతో పాటు ఒక ప్రభుత్వ హిందీ ఉపాధ్యాయుడు రెండు చోట్ల ఓటు వేశారని చెప్పారు. ఫారూఖ్ అలీ అనే వ్యక్తి 38 వ మరియు 34వ వార్డుల్లో ఓటు వేశారని తెలిపారు.

దొంగ ఓట్లు వేసిన వారిలో రాజకీయ నాయకులు, ఉద్యోగులు, మత పెద్దలు ఉన్నారని ఆరోపించిన ఆమె, ఎన్నికల సమయంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఓటర్ ఐడీ కార్డు, ఓటరు జాబితాలో పేరు ఉందని అధికారులు చెప్పి నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఈ విషయమై ఈ నెల 3 న కామారెడ్డి జిల్లా కోర్టులో కేసు దాఖలు చేసినట్లు తెలిపారు. ఏప్రిల్ 6 న విచారణ జరగనుందని, న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్ప ఉమారాణి తరఫున 119వ బూత్ ఏజెంట్‌గా పని చేసిన మోచి సురేందర్ మాట్లాడుతూ, రాజంపేట గ్రామస్తులు వచ్చి ఓట్లు వేయడాన్ని తాను చూశానని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -