Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పస్తులంటూనే పనులు.!

పస్తులంటూనే పనులు.!

- Advertisement -

మూడు నెలలుగా అందని వేతనాలు
ఇబ్బందుల్లో జీపీ మల్టిపర్పస్ వర్కర్లు
నవతెలంగాణ – మల్హర్ రావు 

గ్రామపంచాయతీల్లో పనులు చేసే మల్టీపర్పస్ వర్కర్లకు మూడు నెలల తరబడి వేతనాలు అందడం లేదని, దీంతో పస్తులతో పనులు చేయలేక అవస్థలు పడుతున్నట్లుగా మండల వ్యాప్తంగా ఉన్న 70 మంది మల్టీపర్పస్ వర్కర్లు వాపోతున్నారు.

వెట్టిచాకిరీ..
మల్టీపర్పస్ వర్కర్లు అరకొర వేతనాలతో వెట్టి చాకిరీ చేస్తున్నారు. వారాంతపు సెలవులు ఉండక పోగా, ఎన్నికల విధుల్లో తీరిక లేకుండా పని చేసినా అదనపు వేతనం కూడా చెల్లించలేదు. గ్రామాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు వస్తే పారిశుద్ధ్య పనులు మొదలు అంతా వీరే చేయాల్సి వస్తుంది. గ్రామాల్లో ఎవరైనా మృతి చెందితే సున్నం మార్కింగ్ ఇవ్వడం భోజనాలు పెడితే విస్తళ్లను ట్రాక్టర్లల్లో డంపింగ్ యార్డుకు తరలించడం, తాగునీటి సరఫరా, పైపు లైన్ల మరమ్మతులు, డ్రెయినేజీల శుభ్రత.. ఇలా ఏ పనైనా మల్టీపర్పస్ వర్కర్లే చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

అయినా ప్రభుత్వం రకరకాల సాకులు చూపి వేతనాలు నిలిపేయడం పరిపాటిగా మారింది. నెలలతరబడి వేతనాలు అందక, బయట అప్పులు పుట్టక ఇబ్బంది పడుతున్నామని వారు వాపోతున్నారు. కాగా, చనిపోయిన, వేతనాలు చాలక, ఇతరత్రా కారణాలతో పనులు మానేసిన వర్కర్ల పేర్లే ఇంకా ఆన్లైన్లో కనిపించడం, వారి పేరుతోనే వేతనాలు మంజూరు చేయడంతో కొత్తగా వచ్చిన వారికి చెల్లింపు కష్టంగా మారినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -