నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
సిద్దిపేట జిల్లా పరిధిలోని రంగనాయక సాగర్ రిజర్వేయర్ నుంచి డి10 కెనాల్ నుంచి జనగామ నియోజకవర్గంలోని కొమురవెల్లి మండలంలోని తపాస్ పల్లి రిజర్వేయర్ డి3 కెనాల్ పరిధిలో ఉన్న ఆయకట్టును స్థిరీకరణ చేసి సాగునీరు అందించాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డిని కోరారు.
దూల్మిట్ట, చేర్యాల మండలాల పరిధిలోని కమలాయపల్లి, అర్జున్ పట్ల, ఆకునూరు, జాలపల్లి, లింగాపూర్,దూల్మిట్ట గ్రామాల పరిధిలోని సుమారు 7 వేల ఎకరాలకు రంగనాయక సాగర్ డి10 కెనాల్ కింద స్థిరీకరించాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వినతి పత్రం అందజేసినట్టు తెలిపారు. వెంటనే స్పందించిన మంత్రివర్యులు టెంపర్వరి జీవోను ఇచ్చే నీళ్లు వచ్చేలా చేశారు.
రాబోయే ఎండాకాలన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నీటిపారుదల శాఖ ని కలిసి చెరువులకు నీటిని సరఫరా చేసి సాగునీరు అందించాలని, గతంలో ఇచ్చిన టెంపర్వరి జీవో కాకుండా పర్మినెంట్ జీవో ఇవ్వాలని మంత్రిని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. దీనివల్ల భూగర్భ జలమట్టం పెరిగి రైతులకు మేలు జరుగుతుందని అయన వివరించారు. ఈ విషయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు.



