Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

- Advertisement -

నవతెలంగాణ – పెద్దవూర
మండలం లోని వెల్మగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో  విద్యార్థులు బుధవారం ఘనంగా స్వపరిపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా తోటి విద్యార్థులకు పాఠాలు బోధించి పలువురిని ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు చెప్పారు. ముఖ్యమంత్రి గా త్రివిక్రమ్, ఎంపీగా శివశంకర్,ఎంఎల్ ఏ గా హేమంత్, కలెక్టర్ గా  సంజన, జాయింట్ కలెక్టర్ గా అర్పిత, డీఈఓగా ఇందు,ఎంఈఓ గా శివ, సర్పంచిగా భరత్, ప్రధానోపాధ్యాయులుగా గా చందు తమ విధి నిర్వహినలు పాటించారు.

విద్యార్థులే రాజకీయ నాయకులుగా,కలెక్టర్ గా,మంత్రులు గా,ఒకరోజు వ్యవహరించిన తీరు గ్రామస్తుల అందరిని ఆకట్టుకుంది. ఈ స్వయం పరిపాలన దినోత్సవం పురస్కరించుకొని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చీదేళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు చాలా చక్కగా తమ తమ విధులను నిర్వర్తించారని కొనియాడారు. ఉత్తమ ప్రతిభను కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బహుమతులు ప్రధానం చేశారు. ఇట్టి కార్యక్రమంలో  ఉపాధ్యాయులు వసంత కుమార్, రామకృష్ణారెడ్డి, హిమవంత్ రెడ్డి, రామాంజిరెడ్డి,వెంకటయ్య, సమత, శకుంతల, అయేషా, హరీష్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -