నవతెలంగాణ – పెద్దవూర
గ్రామీణాభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్ర కీలకమనిమండల అభివృద్ధి అధికారి ఉమాదేవి అన్నారు. నూతనంగా ఎన్నికైన 122 వార్డు సభ్యులకు 5 రోజుల శిక్షణ కార్యక్రమం లో భాగంగా మండలప్రజాపరిషత్ కార్యాలయం లో బుధవారం మూడవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భం గా ఎంపీడీఓమాట్లాడుతూ వార్డుమెంబర్లకు పంచాయతీరాజ్ వ్యవస్థ కీలక మైన బాధ్యతలు కట్టబెట్టిందన్నారు.
వార్డుల్లో సమస్యలు గుర్తించి పరిష్క రించడంలో చురుగ్గా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరేలా కృషి చేయాలన్నారు. పంచాయతీరాజ్ చట్టం, గ్రామసభల నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలు, అభివృద్ధి పథకాల అమలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలపై వార్డు సభ్యులకు మాస్టర్ ట్రైనర్ల ద్వారా అవగాహన కల్పిస్తు న్నామని చెప్పారు. వార్డు సభ్యులు శిక్షణ తరగతులను సద్వినియోగం చే సుకోవాలని కోరారు.



