- Advertisement -
నవతెలంగాణ – :హైదరాబాద్ : బుధవారం మధ్యాహ్నం ఘట్కేసర్ రైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే గేటు దాటుతుండగా రైలు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. రైలు ఢీకొన్న ధాటికి మహిళ గుర్తుపట్టలేని స్థితిలో పడిపోయింది. ఈ రైల్వే గేటును సంవత్సరం క్రితం రైల్వే శాఖ శాశ్వతంగా మూసివేసింది, కేవలం పాదచారులకు మాత్రమే అనుమతి ఉంది. ఘట్కేసర్ పట్టణంలో వంతెన నిర్మాణం ఆలస్యం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -



