నవతెలంగాణ – అశ్వారావుపేట
స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ బుధవారం అశ్వారావుపేట మున్సిపాలిటీ లో పలు ప్రయివేట్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముందుగా ఆయన అశ్వరావుపేట – సత్తుపల్లి రోడ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీశ్రీ ఎంటర్‌ప్రైజెస్ ను తన చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం మొదటి వార్డులో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ మద్దిరావమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమాలలో మున్సిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు, ఒకటి, రెండు వార్డుల కౌన్సిలర్ లు డేరంగుల ప్రసాద్,దగ్గుమల్లి మౌనిక, కాంగ్రెస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.



