Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎంపీడీఓ ప్రోత్సాహం

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఎంపీడీఓ ప్రోత్సాహం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని జుక్కల్, మహమ్మదాబాద్ గ్రామంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులకు జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ గ్రామ జిపి కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, జీవన్ రాథోడ్ తో కలిసి నిర్మాణ లబ్ధిదారులకు బుధవారం ప్రోత్సాహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామంలో మంజూరైన లబ్ధిదారులకు ఇల్లు నిర్మించుకునేందుకు ప్రోత్సహించడం జరిగిందని అన్నారు. ఇందిరమ్మ పథకంలో గృహ నిర్మాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరు మంజూరైన లాబ్ లెవల్ పనులు పూర్తి చేసుకున్న వారందరూ ఉగాదిలోపు గృహప్రవేశం కార్యక్రమం నిర్వహించేందుకు లబ్ధిదారులకు ప్రోత్సహించారు.

అదేవిధంగా పునాది లెవల్లో ఉన్న లబ్ధిదారులకు త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. గ్రామంలో ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా మండల స్థాయి అధికారులను సంప్రదించాలని సమస్యను పరిష్కరించేందుకు తామంత కృషి చేస్తామని అన్నారు. ఇంటి నిర్మాణాలు చేపడుతున్న ప్రతి ఒక్క లబ్ధిదారుడు ప్రభుత్వ నిబంధనలకు లోబడి మార్కింగ్ వేసిన చోటనే ఇంటి నిర్మాణాలు చేపట్టాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కట్టిన వాటికి బిల్లులు రావని లబ్ధిదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో  ఎంపీడీవో తో పాటు గ్రామ జిపో కార్యదర్శి , ఇందిరమ్మ గృహ నిర్మాణాల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

– మండల కేంద్రంలో ఇందిరమ్మ గృహం నిర్మాణం పూర్తి చేసిన లబ్ధిదారునికి జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ గ్రామ పంచయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి బుధవారం నాడు శాలువాతో సన్మానించి సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీవో లబ్ధిదారులతో మాట్లాడుతూ ఇందిరమ్మ  గృహ పథకంలో నిర్మాణం పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి పూర్తిస్థాయిలో బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందని అందులో భాగంగా ఈరోజు సన్మానించిన లబ్ధిదారునికి బిల్లు మంజూరు కొరకు పంపించడం జరిగిందని త్వరలో త్వరలో బిల్లు లబ్ధిదారుని ఖాతాలో జమ చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయ గౌడ్, జుక్కల్ గ్రామపంచాయతీ జూనియర్ అసిస్టెంట్ గల్కట్ వార్ రాజు, సిబ్బంది, యువ నాయకుడు విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -