నవతెలంగాణ – కాటారం
తెలంగాణ ప్రభుత్వ స్పోర్ట్స్ స్కూల్ (హకీంపేట్) లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతి ప్రవేశాల కోసం మండల స్థాయి ఎంపిక కోసం శుక్రవారం కాటారం మండల కేంద్రంలో నిర్వహించనున్నట్లు మండల విద్యా శాఖ అధికారిణి ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఎంపికల్లో మండల పరిధి నుండి ప్రతిభ కలిగిన 10 మంది బాలురు, 10 మంది బాలికలను ఎంపిక చేయనున్నారు. సెప్టెంబర్ 1, 2017 నుండి ఆగస్టు 31, 2018 మధ్య జన్మించిన విద్యార్థులు మాత్రమే అర్హులు.
ఆసక్తి గల విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://tgss.telangana.gov.in/� ద్వారా నమోదు చేసుకోవాలని అధికారిణి సూచించారు. ఎంపికల రోజు విద్యార్థులు తమ ఒరిజినల్ ధృవపత్రాలు, జిరాక్స్ ప్రతులను వెంట తీసుకురావాలని తెలిపారు.
మండల స్థాయిలో ఎంపికైన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలకు అర్హత సాధిస్తారు. జిల్లా స్థాయి ఎంపికలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియం లో నిర్వహించబడనున్నాయి. పూర్తి వివరాల కోసం మండల విద్యా శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలని మండల విద్యా శాఖాధికారిణి సూచించారు.



