నిర్వహణ లేక నిరుపయోగం
పట్టించుకోని మునిసిపాలిటీ అధికారులు
నవతెలంగాణ – అచ్చంపేట
పట్టణ ప్రజలు కొద్దిసేపు ఆహ్లాదకరమైన వాతావరణ గడపాలని ఉద్దేశంతో మునిసిపాలిటీ లోని పలు కాలనీలలో ప్రజాధనం లక్షలు రూపాయలు ఖర్చు చేసి పకృతి వనాలు ఏర్పాటు చేశారు. ఆట పరికరాలు, వ్యాయామం చేయడానికి పరికరాలు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం, నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా ఉన్నాయి. ప్రజాధనం వృధా ఖర్చు అయింది.
బస్టాండు దగ్గరలో వాటర్ ట్యాంక్ ఆవరణలో ఏర్పాటు చేసిన పకృతి వనం చెట్లు ఎండిపోతున్నాయి. పరిసరాలు పిచ్చి మొక్కలతో అధ్వానంగా ఉన్నాయి. వ్యాయామ చేసే పరికరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.
వలపట్ల కాలనీ, సాయిరాం కాలనీల లో పట్టణ పకృతి వనాలు నిరుపయోగంగా ఉన్నాయి. కలుపు మొక్కలు పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగి ఎండిపోయాయి . చెట్లు ఎండిపోయాయి. చెట్లకు రాలిన ఆకులతో పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నాయి. మున్సిపాలిటీ అధికారులు స్పందించి ప్రకృతి వనాలు ప్రజలు ఉపయోగించే విధంగా వినియోగంలోకి తీసుకురావాలని ఆయా కాలనీ ప్రజలు కోరుతున్నారు.



