నవతెలంగాణ – హైదరాబాద్: మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు భారత స్టాక్ మార్కెట్లను తీవ్రంగా దెబ్బతీశాయి. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న ప్రతికూల పరిస్థితులతో పెట్టుబడిదారులు ఆందోళనకు గురయ్యారు. దీంతో వరుసగా మూడో సెషన్‌లో కూడా సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఇవాళ్టి ట్రేడింగ్‌లో అన్ని రంగాల్లో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో మార్కెట్లు కుప్పకూలాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 1122.66 పాయింట్లు (1.40%) నష్టపోయి 79,116.19 వద్ద స్థిరపడింది. గత 10 నెలల్లో సెన్సెక్స్‌కు ఇదే అత్యంత కనిష్ఠ స్థాయి కావడం గమనార్హం. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ కూడా 385.2 పాయింట్లు (1.6%) పతనమై 24,480.5 వద్ద ముగిసింది. నిఫ్టీకి ఇది ఆరు నెలల కనిష్ఠ స్థాయి.
మూడో రోజు భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



