- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : అత్యంత కాలుష్యపూరిత నగరాల్లో గాలిని శుభ్రపరిచేందుకు భారతదేశపు మొట్టమొదటి మొబైల్ ‘లిక్విడ్ ట్రీ’ని సీఎస్‌ఐఆర్-సీఐఎంఎఫ్‌ఆర్ సంస్థలు అభివృద్ధి చేశాయి. ఇది కార్బన్‌డైఆక్సైడ్‌ను పీల్చుకొని ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. కాంపాక్ట్ గాలి-శుద్ధీకరణ వ్యవస్థను అభివృద్ధి చేసినట్లు సీఎస్‌ఐఆర్-సీఐఎంఎఫ్‌ఆర్ పరిశోధకులు ప్రకటించారు. ఈ పరికరం నిరంతరం CO2ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తూ, గాలి నాణ్యతను మెరుగుపరుస్తాయి. విద్యుత్తుతో పాటు సౌరశక్తితో పనిచేసేలా రూపొందించారు ఈ మొబైల్ యూనిట్‌ను.
- Advertisement -



