Tuesday, July 7, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్, గుడ్డు ధరలు

తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన చికెన్, గుడ్డు ధరలు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో చికెన్, కోడి గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్, విజయవాడలో స్కిన్‌లెస్ చికెన్ కేజీ రూ.340-350కి, డ్రెస్డ్ చికెన్ రూ.320కి చేరింది. గుడ్ల ధర డజనుకు రూ.90-100కి పెరగడంతో సామాన్యుల బడ్జెట్ పై భారం పడుతోంది. ఏపీలో చికెన్ ధర రూ.210 నుంచి రూ.330కి, గుడ్డు ధర రూ.6 నుంచి రూ.8.50కి పెరిగింది. హీట్ కారణంగా కోళ్ల మరణాలు పెరిగి, ఉత్పత్తి తగ్గడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని రైతులు, వ్యాపారులు పేర్కొంటున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు హెచ్చరించాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -