Tuesday, July 7, 2026
E-PAPER
Homeజాతీయం‘బ్రిడ్జిమ్యాన్‌’ గిరీష్‌ భరద్వాజ్‌ ఇకలేరు

‘బ్రిడ్జిమ్యాన్‌’ గిరీష్‌ భరద్వాజ్‌ ఇకలేరు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ప్రముఖ సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత గిరీష్‌ భరద్వాజ్‌ (76) మరణించారు. దక్ష‍ిణ కన్నడ జిల్లాలోని సుల్లియాలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దేశవ్యాప్తంగా 140కి పైగా హ్యాంగింగ్‌ ఫుట్ బ్రిడ్జీలను నిర్మించడంతో ఆయనను ‘బ్రిడ్జిమ్యాన్‌’, ‘సేతు బంధ్‌’ అని పిలుస్తారు. ఆయనకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. తక్కువ ఖర్చుతో, పర్యావరణ హితంగా హ్యాంగింగ్‌ వంతెనలను నిర్మించడంలో ఆయన పేరుగాంచారు. ఆయన నిర్మించిన 140 హ్యాంగింగ్‌ బ్రిడ్జీల్లో 120 బ్రిడ్జీలు గ్రామీణ ప్రాంతాల ప్రజలను ఇతర ప్రాంతాలో అనుసంధానించేందుకు నిర్మించినవి కాగా, మిగిలినవి పర్యాటకం కోసం నిర్మించారు. ఆయన సేవలకు గాను డా.కోట శివరామా కరంత హత్తూరా ప్రశస్తి పురస్కారంతో పాటు భారత ప్రభుత్వం 2017లో ‘పద్మశ్రీ’తో సత్కరించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -