Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి: ఎంఆర్పీఎస్

నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలి: ఎంఆర్పీఎస్

- Advertisement -

లేనిపక్షంలో ఆందోళనలు తప్పవని హెచ్చరిక
నవతెలంగాణ – కాటారం

ఎంఆర్పీఎస్ (ఎంఆర్పీఎస్) ఆధ్వర్యంలో కాటారం మండల కేంద్రంలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. గంగారం క్రాస్ రోడ్ వద్ద కల్వల భాలాజీ కుటుంబ సభ్యులపై జరిగిన దాడి ఘటనపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు డిమాండ్ చేశారు.

కాటారం మండలంలోని గంగారం క్రాస్ రోడ్ వద్ద కల్వల భాలాజీ కుటుంబ సభ్యులపై దాడి చేసి ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసినట్లు ఆరోపించారు. కుటుంబ సభ్యురాలు కల్వల దుర్గమ్మ (55) అనే వృద్ధ మహిళను అర్థరాత్రి రెండు చేతులు కట్టేసి తీవ్రంగా హింసించి కొట్టినట్లు తెలిపారు. బాధితులు వెంటనే కాటారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు పంపాల్సి ఉండగా, ఏడాదిన్నర కాలంగా విచారణ పేరుతో కాలయాపన జరుగుతోందని ఆరోపించారు.

ఈ విషయమై బాధితులు మంద క్రిష్ణ మాదిగను కలిసి గోడు వెల్లబోసుకోగా, ఆయన ఆదేశాల మేరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు కాటారం సబ్‌డివిజన్‌లోని డీఎస్పీని కలిసి విజ్ఞాపన పత్రం అందజేశారు. వెంటనే నిందితులను అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని వారు కోరారు.

ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు అంబాల చంద్రమౌళి మాదిగ, కాటారం మండల అధ్యక్షుడు మంథేన చిరంజీవి మాదిగ మాట్లాడుతూ, తక్షణ చర్యలు తీసుకోకపోతే ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నోముల శ్రీనివాస్ మాదిగ, గాజుల బిక్షపతి మాదిగ, సీనియర్ నాయకులు దోర్నాల రాజేందర్ మాదిగ, కేసారపు నరేష్ మాదిగ (మల్హర్ మండల అధ్యక్షులు), విద్యార్థి నాయకులు చంటి తిరుపతి, వేమునూరి జక్కయ్య, ఆత్కూరి శంకర్, కల్వల సమ్మయ్య, కల్వల రమేష్, కల్వల భాపు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -