– వెంటనే చర్యలకు ఎన్పీడీసీఎల్ ఏడి వెంకట రత్నం ఆదేశం
– త్వరలో పరిష్కారానికి హామీ
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలం లోని వేదాంతపురం పంచాయతీ లో నెలకొన్న విద్యుత్ సరఫరా సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సర్పంచ్ తోట వెంకటమ్మ బుధవారం ఎన్పీడీసీఎల్ ఏడీ వెంకట రత్నం ను కలిసి వినతిపత్రం ఇచ్చారు.గ్రామంలో తరచూ విద్యుత్ అంతరాయం, తక్కువ వోల్టేజ్ వంటి సమస్యల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
సర్పంచ్ వినతిపై సానుకూలంగా స్పందించిన ఎన్పీడీసీఎల్ ఏడీ వెంకట రత్నం, గ్రామంలో ఉన్న విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అవసరమైన పనులకు సంబంధించి తగిన ఎస్టిమేట్లు సిద్ధం చేసి ప్రతిపాదనలు పంపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఉపసర్పంచ్ సంగీత వీర్రాజు, వార్డు సభ్యులు గణప వెంకటలక్ష్మి,గడ్డం మహాలక్ష్మి, తోట వెంకటస్వామి,మాజీ సర్పంచ్ సోమిని శివశంకర ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.


