Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఊరుకొండలో హోలీ.. రంగుల కేలి..

ఊరుకొండలో హోలీ.. రంగుల కేలి..

- Advertisement -

– ఆనందోత్సవాలలో యువత చిన్నారులు..
నవతెలంగాణ – ఊరుకొండ 

ఊరుకొండ మండల కేంద్రంతోపాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో హోలీ పండుగను పురస్కరించుకొని పెద్ద చిన్న తేడా లేకుండా అందరూ కలిసి ఒకరి పై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాలతో చిందులు వేస్తూ రంగుల కేళి ఘనంగా జరుపుకున్నారు. బుధవారం హోలీ పండుగను పురస్కరించుకొని ఊరుకొండ మండలంలో రంగుల కేళీ డప్పుల మోతలతో చిందులు వేస్తూ.. హోళీ హోలీల రంగ హోళీ.. చేమకేళిల హోళీ.. అంటూ మహిళలు.. జోజర జోజర గాజుల పాప అంటూ యువకులు పాటలు పాడుతూ.. ఆటలు ఆడుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా హోళీ సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, పెద్దలు, యువకులు, మహిళలు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -