Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇంటికే శ్రీ సీతా రాములవారి కల్యాణ తలంబ్రాలు

ఇంటికే శ్రీ సీతా రాములవారి కల్యాణ తలంబ్రాలు

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఆర్.టి.సి.కార్గో సేవా విభాగం ద్వార నడపబడుతున్న ఆర్.టి.సి.కార్గోలో భక్తులు ‘’భద్రాచలంలో ఈనెల 27 శ్రీరామ నవమి పండగ సందర్భంగా శ్రీ సీతా రాములవారి కల్యాణానికి’’ వెళ్ళలేని భక్తులకు కేవలం రూ.151/- కె ‘’శ్రీ సీతా రాములవారి కల్యాణ తలంబ్రాలు’’ మీ ఇంటి వద్దకే తెచ్చి ఎవ్వబడుతోందని నిజామాబాద్-1 డిపో మేనేజర్ ఆనంద్ తెలిపినారు.

ఈ సదుపాయాన్ని tgsrtclogistics.co.in అనే వెబ్‌సైట్ ద్వారా RTC కార్గో నిజామాబాద్ , కామారెడ్డి జిల్లా లోని అన్నీ ఆర్.టి.సి.కార్గో కౌంటర్ వద్ద కూడా బుక్ చేసుకునే అవకాశం కలదు అని అన్నారు. ఈ సదావకాశని  ఉమ్మడి నిజామాబాద్ భక్తులు ఉపయోగించుకోవాలని కోరారు. పూర్తివివరాలకు ఈ ఫోన్ నెంబర్ ఆర్మూర్డిపో -7396889496, . బోధన్డిపో- 9154298729. నిజామాబాద్-1 డిపో-9154298727, .నిజామాబాద్-2 డిపో-7396889496, బాన్స్వాడ డిపో-9154298729, కామారెడ్డి డిపో-9154298729, ఆర్. యం. ఆఫీసు-8639969647 లకు సంప్రదించాలని అన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -