- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఇంగ్లాండ్ క్రికెటర్లకు స్పిన్‌ను ఎదుర్కోవడంలో మంచి రికార్డులేమీ లేవని ఆ దేశ కెప్టెన్ హ్యారీ బ్రూక్ అన్నారు. గురువారం టీ20 ప్రపంచకప్ రెండో సెమీస్‌లో భారత్‌తో తలపడుతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు. టీమ్ ఇండియాలో మంచి స్పిన్నర్లు ఉన్నారని.. వారిని ఎదుర్కొని పరుగులు రాబట్టడం తమకు పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. వరుణ్ చక్రవర్తి ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకరని.. అతడి బౌలింగ్‌ను ఎదుర్కొని రన్స్ తీయడం కష్టమన్నారు.
- Advertisement -



