Wednesday, March 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన శోభాయాత్రపై పోలీసులు అత్యుత్సాహం

ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన శోభాయాత్రపై పోలీసులు అత్యుత్సాహం

- Advertisement -

మున్నూరు కాపులపై సుమోటో కేసు… పోలీసుల తీరుపై ఆగ్రహం
నవతెలంగాణ – కాటారం 

కాటారం మండల కేంద్రంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయడాన్ని మండల మున్నూరు కాపు సంఘం తీవ్రంగా ఖండించింది.

ఫిబ్రవరి 19న శివాజీ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయం నుంచి జాతీయ రహదారి మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. శోభాయాత్రగా సాగిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు, సామాజిక వర్గ ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం శాంతియుతంగా సాగిందని నిర్వాహకులు తెలిపారు.

అయితే, ఈ ర్యాలీకి సంబంధించి పోలీసులు ఇటీవల సుమోటోగా కేసు నమోదు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కాటారం మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు తోట కోటేశ్వర్ పటేల్ స్పందిస్తూ, హిందూ ధర్మ పరిరక్షకుడు శివాజీ మహారాజ్ జయంతిని శాంతియుతంగా జరుపుకోవడం తప్పా అని ప్రశ్నించారు.

ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన శోభాయాత్రపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని ఆయన ఆరోపించారు. మున్నూరు కాపు సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని కేసులు నమోదు చేయడం శోచనీయమని పేర్కొన్నారు. వెంటనే నమోదు చేసిన సుమోటో కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సామాజిక వర్గ సంఘటిత శక్తితో నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -