Wednesday, March 4, 2026
E-PAPER
Homeకరీంనగర్నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి..

నేరెళ్ల బాధితులకు న్యాయం చేయాలి..

- Advertisement -

లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం..
హామీలు ఇచ్చి మర్చిపోయిన నేతలపై బాధితుల ఆవేదన
నేరేళ్ల బాధితుల ఇంటికెళ్ళి పరామర్శించిన తీన్మార్ మల్లన్న
నవతెలంగాణ – తంగళ్ళపల్లి

2017లో జరిగిన నేరెళ్ల ఘటనలో పోలీసుల చేతిలో చిత్రహింసలకు గురైన నేరెళ్ల బాధితులకు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తంగళ్ళపల్లి మండలం నేరెళ్లలో జరిగిన ఘటనలో హింసకు గురైన నేరెళ్ల బాధితులను ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బుధవారం నేరెళ్ల గ్రామంలో వారిని పరామర్శించారు. అప్పుడు జరిగిన ఘటనలో పోలీసులు అమానుషంగా థర్డ్ డిగ్రీ ఇచ్చారని బాధితులు గుర్తుచేసుకుంటూ తమకు ఇప్పటికీ న్యాయం జరగలేదని ఏ ప్రజా ప్రతినిధి కూడా తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ… ఈ కేసులో బాధ్యులైన పోలీస్ అధికారులపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బాధితులకు న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వం నుంచి సమాధానం కోరుతానని హామీ ఇచ్చారు.నేరెల్ల ఘటనపై న్యాయం జరిగే వరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ బాధితుల పక్షాన నిలబడుతుందని మల్లన్న స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా అన్ని వేదికలలో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -