Thursday, March 5, 2026
E-PAPER
Homeసినిమాఅందుకే ఫ్యామిలీ ప్యాకేజ్‌..

అందుకే ఫ్యామిలీ ప్యాకేజ్‌..

- Advertisement -

శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఈటీవీ విన్‌తో కలిసి నిర్మాతలు బన్నీ వాస్‌, వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను ఈటీవీ విన్‌ అసోసియేషన్‌తో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రిక్కి సమర్పణలో హీరో శివాజీ స్వయంగా నిర్మించగా, సుధీర్‌ శ్రీరామ్‌ తెరకెక్కించారు. ఈనెల 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బ్రహ్మానందం, బండ్లగణేష్‌ అతిథులుగా విచ్చేశారు.
హీరో, నిర్మాత శివాజీ మాట్లాడుతూ, ‘ఈటీవీ విన్‌ నుంచి వస్తున్న సినిమా అంటే ఆడియన్స్‌లో క్యూరియాసిటీ ఉంటుది. ఇప్పుడు ఈ చిత్రం విషయంలో కూడా అలాంటి ఆసక్తి ఉంది. సినిమా ప్రేక్షకుడికి దూరం కాకూడదు అనే ఉద్దేశంతో ఈటీవీ విన్‌ థియేటర్‌లో ఈ సినిమా చూడటానికి ఓ ఫ్యామిలీ ప్యాకేజీని ప్రకటించారు. కేవలం 499 రూపాయలకు 4 నాలుగు టికెట్లు ఓ పాప్‌ కార్న్‌ను సింగిల్‌ స్క్రీన్స్‌లో, 799 రూపాయాలకు నాలుగు టికెట్లు, ఓ బిగ్‌ పాప్‌కార్న్‌ను మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌లో ఈ ప్యాకేజీలో భాగంగా అందించ నున్నారు. దీంతో సినిమా మరింత మందికి దగ్గరవుతుంది. ఈ సినిమా ఆడియన్స్‌ను డిజప్పాయింట్‌ చేయదని ఖచ్చితంగా చెప్పగలను. ఫ్యామిలీ అందరూ కలిసి హ్యపీగా ఈ సినిమాను థియేటర్‌లో ఎంజారు చేయవచ్చు’ అని అన్నారు. ‘ఈ సినిమాలో మంచి ఫన్‌ ఉంది. క్రైమ్‌ ఎలిమెంట్‌ ఉంది. హీరో కామన్‌ మ్యాన్‌ పాత్ర. అందరికి కనెక్ట్‌ అయ్యే పాత్ర ఇది. ఈ సినిమా సక్సెస్‌తో శివాజీ కష్టం ఫలించబోతుంది’ అని నిర్మాత వంశీ నందిపాటి చెప్పారు.
ఈటీవీ విన్‌ నితిన్‌ చక్రవర్తి మాట్లాడుతూ, ‘కామెడీని ఇష్టపడని వారు ఎవరు ఉండరు. సినిమా చూసి అందరూ నవ్వూతూ థియేటర్స్‌ నుండి వెళతారు. కచ్చితం అందర్నీ మెప్పించే సినిమా అవుతుంది’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -