– అగ్నిగుండాల ప్రవేశ కార్యక్రమంలో తోపులాట
– నిప్పుల్లో పడిపోయి పలువురికి గాయాలు
నవతెలంగాణ-వేములపల్లి
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్ గ్రామంలోని శ్రీపార్వతి రామ లింగేశ్వర స్వామి దేవాలయం జాతర ఉత్సవాల్లో బుధవారం తెల్లవారుజామున అపశృతి జరిగింది. ప్రతిఏటా మాదిరిగానే ఈనెల ఒకటో తారీకు నుంచి ప్రారంభమైన జాతరలో భాగంగా బుధవారం తెల్లవారుజామున అగ్నిగుండాల ప్రవేశ కార్యక్రమం నిర్వహిస్తుండగా సందర్శకుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే పలువురు అగ్నిగుండాల్లో పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పోలీసులు అప్రమత్తమై నిప్పుల్లో పడ్డవారిని వెంటనే కాపాడారు. గ్రామానికి చెందిన ఉత్తర్ల కృష్ణయ్య, మరిపెద్ది సాయి, ఒట్టే మానస సింగం వినోద, మేడ బోయిన సైదమ్మకు గాయాలయ్యాయి. కేతెపల్లి మండలం భీమారం గ్రామానికి చెందిన మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. వేములపల్లి, మాడుగులపల్లి ఎస్‌ఐలు వెంకటేశ్వర్లు, కృష్ణయ్య అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ముప్పు తప్పిందని స్థానికులు తెలిపారు.
ఆమనగల్లు జాతరలో అపశృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



