Thursday, March 5, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబ్లడ్‌ క్యాన్సర్‌కు జనరిక్‌ మందు

బ్లడ్‌ క్యాన్సర్‌కు జనరిక్‌ మందు

- Advertisement -

విడుదల చేసిన నాట్కో

వాషింగ్టన్‌ : బ్లడ్‌, బోన్‌ మారో క్యాన్సర్‌ చికిత్స కోసం జనరిక్‌ మెడిసిన్‌ పొమలిడోమిడే క్యాప్సూల్స్‌ను అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ నాట్కో విడుదల చేసింది. అమెరికా మార్కెట్లో విడుదల చేసిన ఈ క్యాప్సూల్స్‌1 ఎంజీ, 2 ఎంజీ, 3 ఎంజీ, 4 ఎంజీ మోతాదుల్లో లభిస్తుందని, ప్రముఖ ఫార్మసీలు, క్లినిక్‌లు ద్వారా ఈ ఉత్పత్తి పంపిణీ అవుతుందని నాట్కో తెలిపింది. బ్రెకెన్‌రిడ్జ్‌ ఫార్మాస్యూటికల్‌, ఇంక్‌ భాగస్వామ్యంతో ఈ ఉత్పత్తిని నాట్కో మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ ఉత్పత్తి వివరాలను నాట్కో వైస్‌ చైర్మెన్‌, సీఈఓ రాజీవ్‌ నన్నపనేని మీడియాకు వెల్లడించారు. ఈ ఉత్పత్తితో క్యాన్సర్‌ చికిత్సలో తమకు ఉన్న ప్రత్యేకత మరింతగా పెరుగుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో ఇలాంటి సంక్లిష్టమైన, ప్రత్యేకమైన ఉత్పత్తులను మరింతగా మార్కెట్లోకి తీసుకురావడానికి ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -