Thursday, March 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబాలికల ఆశ్రమ కళాశాలలో ఫుడ్‌ పాయిజన్‌

బాలికల ఆశ్రమ కళాశాలలో ఫుడ్‌ పాయిజన్‌

- Advertisement -

అస్వస్ధతకు గురైన 10 మంది విద్యార్థులు
ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలి: ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌


నవతెలంగాణ-ఏటూరునాగారం ఐటీడీఏ
ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని ఆకులవారి గణపురం ప్రాంతంలో ఉన్న గిరిజన బాలికల జూనియర్‌ కళాశాలలో బుధవారం కలుషిత ఆహారం తిని సుమారు 10 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అన్నం తిన్న విద్యార్థులు కొద్దిసేపటికే వాంతులు, విరోచనాలు చేసుకుంటుండటంతో ఉపాధ్యాయులు, సిబ్బంది విద్యార్థులను సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విద్యార్థులను పరీక్షించిన వైద్యులు ఫుట్‌ పాయిజన్‌ జరిగిందని, ప్రమాదం తప్పిందని తెలిపారు.

కళాశాల ప్రిన్సిపాల్‌ని సస్పెండ్‌ చేయాలి : ఎస్‌ఎఫ్‌ఐ
కళాశాల ప్రిన్సిపాల్‌ నిర్లక్ష్యం వల్లనే విద్యార్థులకు ఫుడ్‌ పాయిజన్‌ అయిందని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి సోడి అశోక్‌ తెలిపారు. విషయం తెలుసుకున్న వెంటనే ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో అశోక్‌ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రిన్సిపాల్‌ విద్యార్థుల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా ఉంటుందని తెలిసిందన్నారు. కూరగాయలు, కోడిగుడ్లు కుళ్లిపోయిన వాటిని వండి పెట్టడంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయని తెలిపారు. సంబంధిత అధికారులు కళాశాలపై దృష్టి పెట్టకపోవడంతోనే కళాశాల ప్రిన్సిపాల్‌ తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ట్రైబల్‌ వెల్ఫేర్‌ కమిషనర్‌, ఐటీడీఏ పీఓ స్పందించి ప్రిన్సిపాల్‌ని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -