నవతెలంగాణ – చిన్నకోడూరు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళ లకు సానిటరీ కిట్స్ ను అందజేసినట్లు జిల్లా కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి చేతుల మీదుగా అందజేశారు. చిన్నకోడూరు, నారాయణరావుపేట, నంగునూరు మండలలా బ్లాక్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఎదుగాని లహరి ఆధ్వర్యంలో గురువారం మండల పరిధిలోని ఎల్లమ్మ జాలు గ్రామం లో సూమారు 100 మంది మహిళలకు అందజేశారు.
ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటిశ్వరులను చేయడమే లక్షంగా పెట్టుకొవడమే కాకుండా వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుగా ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రతి మహిళ నెలసరికి వాడే శానిటరి కిడ్స్ విషయంలో కూడా కెమికల్స్ ప్యాడ్స్ వాడి అనారోగ్యం బారిన పడకుండా కెమికల్ లేని సానిటరీ కిట్స్ ను ఇలా ప్రభుత్వమే మహిళలకు అందజేయడం శుభపరిణామం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళల అందరికి ఈ సానిటరీ ప్యాడ్స్ అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ నాయకురాలు రజిని, మమత,ఎల్లమ్మ జాలు వార్డ్ మెంబెర్ లాస్య తదితరులు పాల్గొన్నారు.



