నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లాకు నూతనంగా వచ్చిన కలెక్టర్ అనురాగ్ జయంతిని గురువారం బిఎన్ తిమ్మాపురం సర్పంచ్ ఎడ్ల వెంకటరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సర్పంచ్ కలెక్టర్ తో మాట్లాడుతూ.. బస్వపూర్ రిజర్వాయర్ లో మా బిఎన్ తిమ్మాపురం గ్రామం పూర్తిగా ముంపునకు గురవుతున్నదని, కొన్ని సంవత్సరాలుగా మా గ్రామ నష్టపరిహారాల కోసం పోరాడుతున్నామని తెలిపారు. బిఎన్ తిమ్మాపురం గ్రామం పై ప్రత్యేకంగా దృష్టి సారించి, మా ఇండ్ల నష్టపరిహారం, పట్టా కబ్జా భూముల నష్టపరిహారాన్ని ప్రభుత్వంతో మాట్లాడి త్వరగా ఇప్పించే విదంగా కృషి చేయాలని విన్నవించారు.
సమస్యలన్నింటిని పరిష్కరించాలని, మాకు కేటాయించిన పునరావాస నూతన గ్రామాన్ని సందర్శించి మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ సానుకూలంగా స్పందించి అతి త్వరలో మీ నూతన గ్రామాన్ని సందర్శించి మీకు రావాల్సిన నష్టపరిహాలపై ప్రభుత్వంతో మాట్లాడి, ముంపు గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎం డి సమిఉద్దీన్, మోర నర్సి రెడ్డి, కౌన్సిలర్ తహెరా మజర్ పాషా బబ్లు, మాజీ వార్డు సభ్యులు దొంకేన అశోక్ గౌడ్, వళ్ళందస్ పరమేష్ కుమార్ లు పాల్గొన్నారు.



