Wednesday, July 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలునిరంజన్ కుటుంబానికి సోనూసూద్ వీడియో కాల్

నిరంజన్ కుటుంబానికి సోనూసూద్ వీడియో కాల్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని అయిన పొనుగంటి నిరంజన్ (17) అనారోగ్యంతో కన్నుమూశాడు. హన్మకొండకు చెందిన నిరంజన్, అరుదైన జన్యుపరమైన వ్యాధితో కొంతకాలంగా బాధపడుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచాడు. తీవ్ర అనారోగ్యంతో పోరాడుతున్నప్పటికీ, జీవితంపై కొండంత ఆత్మవిశ్వాసంతో ఉన్న నిరంజన్ మరణవార్త అందరినీ కలచివేసింది. నిరంజన్ మరణం గురించి తెలుసుకున్న ప్రముఖ నటుడు సోనూసూద్ ఈ విషయం తెలిసి స్పందించారు. నిరంజన్ కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి పరామర్శించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఈ కష్టకాలంలో వారికి అన్ని విధాలా అండగా ఉంటానని, భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -