Friday, March 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఅందర్నీ మెప్పించే 'మృత్యుంజయ్'

అందర్నీ మెప్పించే ‘మృత్యుంజయ్’

- Advertisement -

శ్రీ విష్ణు హీరోగా, హుస్సేన్‌ షా కిరణ్‌ తెరకెక్కించిన చిత్రం ‘మృత్యుంజయ్’. ఈ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ని లైట్‌ బాక్స్‌ మీడియా, పిక్చర్‌ పర్ఫెక్ట్‌ ఎంటర్టైన్మెంట్‌ బ్యానర్లపై సందీప్‌ గుణ్ణం, వినయ్ చిలకపాటి నిర్మించారు. ‘సామజవరగమన’తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ పెయిర్‌గా నిలిచిన శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్‌ ఈ చిత్రంతో మరోసారి అలరించనున్నారు. ఈ సినిమా నేడు (శుక్రవారం) విడుదల కానుంది. ఈక్రమంలో గురువారం మీడియాకి ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన ప్రీమియర్‌ షో ప్రెస్‌ మీట్‌లో శ్రీ విష్ణు మాట్లాడుతూ, ‘థియేటర్‌లో రెస్పాన్స్‌ చూశాను. అందరూ చాలా ఎంజాయ్ చేశారు. రాజమౌళి నుంచి మా సినిమా ప్రమోషన్‌ స్టార్ట్‌ అయింది. తారక్‌ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు.

నాని రాత్రి మూవీని చూసి మెచ్చుకున్నారు. కంటెంట్‌ మూవీస్‌ ఎప్పుడు వచ్చినా మీడియా, ఆడియెన్స్‌ ఎంకరేజ్‌ చేస్తూనే ఉంటారు. కంటెంట్‌ సినిమాకి అందరూ వచ్చి సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. ‘ఈ చిత్రంలో శ్రీ విష్ణు చాలా కొత్తగా కనిపిస్తారు. ఈ సినిమా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని నిర్మాత సందీప్‌ గుణ్ణం అన్నారు. దర్శకుడు హుస్సేన్‌ షా కిరణ్‌ మాట్లాడుతూ, ‘నాని ఈ మూవీని చూశారు. ఆయనకు నచ్చింది అని నాకు తెలిసిన తరువాత నాకెంతో ప్రశాంతంగా అనిపించింది. ఆయన రివ్యూ ఎప్పుడూ తప్పదు. నా ఈ ప్రయాణంలో సపోర్ట్‌గా నిలిచిన ఎన్టీఆర్‌కి థ్యాంక్స్‌. శ్రీ విష్ణు ఈ చిత్రంలో రిపోర్టర్‌గా నటించారు. ఈ సినిమాలో ఆయన నటన చాలా కొత్తగా ఉంటుంది. రెబా మోనికా పోలీస్‌ ఆఫీసర్‌గా అద్భుతంగా నటించారు’ అని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -