Friday, March 6, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబెంచ్‌ మార్క్‌ సెట్‌ చేసే క్లైమాక్స్‌

బెంచ్‌ మార్క్‌ సెట్‌ చేసే క్లైమాక్స్‌

- Advertisement -

హీరో నాగ చైతన్య, ‘విరూపాక్ష’ ఫేం కార్తీక్‌ దండుతో చేస్తున్న మిథికల్‌ థ్రిల్లర్‌ ‘వృషకర్మ’. ఈ చిత్రాన్ని ఎస్‌విసిసి, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాపినీడు సమర్పిస్తున్నారు. గురువారం మేకర్స్‌ ఈ సినిమా ఫస్ట్‌ గ్లింప్స్‌ను లాంచ్‌ చేశారు. ఈ సందర్భంగా హీరో నాగ చైతన్య మాట్లాడుతూ,’ఈ గ్లింప్స్‌ లాంచ్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. కార్తీక్‌ చెప్పినట్టు ఇది నా కెరీర్లో 100% బెస్ట్‌ మూవీ కాబోతుంది. స్క్రిప్ట్‌ విన్నప్పుడే అనిపించింది. ఇంత పెద్ద స్కేల్‌లో మిథికల్‌ థ్రిల్లర్‌ సినిమా చేయాలని ఎప్పటినుంచో ఉండింది. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది.

ఇది మైండ్‌ బ్లోయింగ్‌ స్క్రిప్ట్‌. కార్తీక్‌ బ్రిలియంట్‌ ఫిలిం మేకర్‌. కథ విన్నప్పుడే లార్జెర్‌ దెన్‌ లైఫ్‌ సినిమా అనిపించింది. నిర్మాతలు ఎక్కడ కాంప్రమైజ్‌ కాకుండా సినిమాని రూపొందించారు. కార్తిక్‌ అనుకున్నది 100% అచీవ్‌ చేశారు. కార్తీక్‌ నాకు చాలా మంచి సినిమా ఇచ్చాడు. అంచనాల న్నింటిని ఈ సినిమా అందుకుంటుంది. ఈ సినిమా చివరి 30 నిమిషాలు క్లైమాక్స్‌ ఇండియన్‌ సినిమాలో ఒక బెంచ్‌ మార్క్‌ అవుతుంది. అది నా ప్రామిస్‌. స్పర్శ్‌ అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు. మీనాక్షి, జయరాం, సత్య అందరూ అద్భుతమైన నటీనటులు ఉన్నారు. రాజీవ్‌ అద్భుతమైన వీఎఫ్‌క్స్‌ ఇచ్చాడు. అజినీస్‌ మ్యూజిక్‌, నాగేంద్ర ప్రొడక్షన్‌ డిజైన్‌ చాలా గ్రాండ్‌గా ఉంటాయి’ అని తెలిపారు.

”విరూపాక్ష’ సినిమా ఇచ్చిన సుకుమార్‌కి థ్యాంక్యూ. సుకుమార్‌, బాపి, మా ముగ్గురి కాంబోనేషన్‌లో ‘విరూపాక్ష’ చేశాం. ఆ సినిమాని ప్రేక్షకులు అద్భుతంగా రిసీవ్‌ చేసుకున్నారు. ఇప్పుడు మరింత గొప్ప సినిమా తీసే అవకాశం ఆడియన్స్‌ ఇచ్చారు. ఎక్కడా క్వాలిటీ తగ్గకుండా చేయడానికి కావలసిన సపోర్టు నిర్మాతల నుంచి ఉంది. ప్రతి దర్శకుడికి పనిచేసే హీరోతో వాళ్ల కెరీర్‌ బెస్ట్‌ ఫిలిం ఇవ్వాలని ఉంటుంది. చైతన్యకి నేనే బెస్ట్‌ ఫిలిం ఇస్తున్నాను. టెక్నీషియన్స్‌ అందరు కూడా అద్భుతంగా పని చేశారు. అన్ని పాత్రలు కూడా చాలా కొత్తగా ఉంటాయి. స్పర్శ్‌ చేస్తున్న క్యారెక్టర్‌ మామూలుగా ఉండదు. ఆ పాత్రలో అద్భుతంగా చేశాడు. ఈ సినిమాలో మీరు కొత్త నాగచైతన్యని చూస్తారు’ అని డైరెక్టర్‌ కార్తీక్‌ దండు చెప్పారు.

మ్యూజిక్‌ డైరెక్టర్‌ అజినిష్‌ మాట్లాడుతూ,”విరూపాక్ష’ సినిమా టాలీవుడ్‌లో నాకు ఒక లాంచ్‌ పాడ్‌ అయింది. ఈ సినిమా చూసిన తర్వాత ఈ జోనర్‌కి కార్తీక్‌ దండుని మాస్టర్‌ అని పిలుస్తారు. తను ఒక్కడు మాత్రమే ఇలా ఆలోచించ గలడు’ అని అన్నారు. స్పర్శ్‌ శ్రీ వాస్తవ మాట్లాడుతూ,’ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో నా పెర్ఫార్మన్స్‌ మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. కార్తీక్‌ ఈ సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దారు’ అని తెలిపారు. ‘ఇది జస్ట్‌ గ్లింప్స్‌ మాత్రమే ఇంకా అద్భుతమైన సన్నివేశాలు ఇందులో చాలా ఉంటాయి. ఈ బ్యానర్‌లో ప్రొడక్షన్‌ డిజైనర్‌గా ‘విరూపాక్ష’ సినిమా నాకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఈ కథ కూడా అద్భుతంగా ఉంటుంది’ అని ప్రొడక్షన్‌ డిజైనర్‌ శ్రీ నాగేంద్ర చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -