Friday, March 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంముగిసిన కడియం విచారణ

ముగిసిన కడియం విచారణ

- Advertisement -

7వ తేదీకి దానం కేసు వాయిదా
ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై ..

నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. గురువారం స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ విచారించారు. కొన్ని గంటలపాటు సాగిన ఈ విచారణలో అనేక విషయాలపై మాట్లాడినట్టు తెలిసింది. మరో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ విచారణ ఇంకా చేపట్టాల్సి ఉంది. తెలంగాణలో ఎమ్మెల్యేల విచారణ కేసు హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. దానం నాగేందర్‌ విచారణను వచ్చే శనివారానికి స్పీకర్‌ వాయిదా వేశారు.

ఈ కేసులో మార్చి 7వ తేదీ నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణకు హాజరు కావాలని ఇరు వర్గాలకు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ సూచించారు. ఈ మేరకు నోటీసులిచ్చారు. దీంతో దానం నాగేందర్‌ పిటిషన్‌ ను స్పీకర్‌ శనివారం విచారించనున్నారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొన్న పలువురి ఎమ్మెల్యేల విచారణ ఇప్పటికే పూర్తయింది. వారందరికీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ క్లీన్‌చీట్‌ ఇచ్చిన విషయం విదితమే. ఈ కేసులో ఎమ్మెల్యే దానం నాగేందర్‌ విచారణ పూర్తయితే, ఈ ఫిరాయింపుల వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేసినట్టవుతుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -