Friday, March 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతి

రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతి

- Advertisement -

నలుగురికి గాయాలు
ఘటనా స్థలాన్ని పరిశీలించిన నిజామాబాద్‌ సీపీ

నవతెలంగాణ-డిచ్‌పల్లి
రోడ్డు ప్రమాదంలో భార్యభర్తలు మృతిచెందిన ఘటన నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం జరిగింది. డిచ్‌పల్లి ఎస్‌హెచ్‌ఓ మోహమ్మద్‌ అరీఫ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన ఎనిమిది మంది పని నిమిత్తం మహారాష్ట్రలోని నాందేడ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి తెల్లవారుజామున 3 గంటలకు బయలుదేరి తిరిగి వస్తుండగా.. కారు వేగంగా నడపడంతో సుమారు 6:30 గంటల ప్రాంతంలో నిజామాబాద్‌ బైపాస్‌కు చేరుకోగానే అదుపుతప్పి మట్టి కుప్పపైకి ఎక్కి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో నాందేడ్‌ జిల్లా ముఖేడ్‌కు చెందిన భార్యాభర్తలు శోభ వాగ్మారే (42), సత్వ తుకారాం వాగ్మారే (45) అక్కడికక్కడే మృతిచెందారు.

కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన చింతల శ్రీనివాస్‌, నాగారం సాయిలు, డ్రైవర్‌ సీతారాం, నాందేడ్‌కు చెందిన అనిత, సాహెబ్‌రావు, బాలాజీ సత్వ వాగ్మారేకు గాయాలయ్యాయి. దోమకొండ నివాసి చింతల శ్రీనివాస్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ప్రమాద ఘటనా స్థలాన్ని సీపీ సాయిచైతన్య సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట డిచ్‌పల్లి ఎస్‌హెచ్‌ఓ మోహమ్మద్‌ అరీఫ్‌, రూరల్‌ ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్‌ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -