రాజకీయ, సినీ ప్రముఖుల హాజరు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పెద్ద కుమారుడు సూర్య విక్రమాదిత్య వివాహం హైదరాబాద్ శంషాబాద్‌లోని జీఎంఆర్ ఎరీనాలో గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేశ, రాష్ట్ర రాజకీయ ప్రముఖులతోపాటు సినీ నటులు, పలువురు పారిశ్రామికవేత్తలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేంద్రమాజీ మంత్రి పి చిదంబరం, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, దామోదర రాజనర్సింహ, వివేక్ వెంటకటస్వామి, టీపీపీసీ చీఫ్ మహేష్‌కుమార్‌గౌడ్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రులు తన్నీరు హరీశ్‌రావు, గంగుల కమలాకర్, మల్లారెడ్డి, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్, ఎంపీలు చామకూర కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎం అనిల్‌కుమార్ యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కెపి వివేకానంద, దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, పాడి కౌశిక్‌రెడ్డి, కేంద్రమంత్రి జి కిషన్‌రెడ్డి, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, శ్రీకాంత్, గోపీచంద్, తనికెళ్ల భరణి, టీజేఎస్ అధినేత కోదండరామ్, ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ, డీజీపీ శివధర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
వైభవంగా భట్టి విక్రమార్క కుమారుని వివాహం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



