నా కోసం ట్రాఫిక్‌ ఆపొద్దు

–  పోలీసు అధికారులను ఆదేశించిన సీఎం
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
తన కాన్వారు కోసం ట్రాఫిక్‌ను ఆపవద్దని నగర పోలీసు ఉన్నతా ధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. సాధా రణంగా నగరంలో ప్రజలు ట్రాఫిక్‌ ఇబ్బం దులను ఎదుర్కొంటున్నారనీ, ఇక తన కాన్వారు కదలిక సందర్భంగా ముందే ట్రాఫిక్‌ను నిలిపేయటం వల్ల ప్రజలు మరింత ఇబ్బందులకు గురవుతారని ఆయన అన్నారు. ఇందుకు తన కోసం ఎక్కడా ట్రాఫిక్‌ను ఆపవద్దని తెలిపారు. ట్రాఫిక్‌లోనే తన కాన్వారు కదలిక సాగేలా చర్యలను తీసుకోవాలని అధికారులను కోరారు. సీఎం ఆదేశాల మేరకు తాము నడుచు కుంటామనీ, అయితే కాన్వారు సక్రమంగా సాగేలా, ప్రజలకు ఇబ్బంది కలగకుండా అవసరమైన చర్యలను తాము తీసుకు ంటామని నగర పోలీసు కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి ‘నవతెలంగాణ’తో మాట్లాడుతూ అన్నారు. ముఖ్యంగా, సీఎం సెక్యూరిటీ పైనా ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని ఆయన తెలిపారు.

Spread the love