Saturday, March 7, 2026
E-PAPER
Homeసినిమాకీలక షెడ్యూల్‌ పూర్తి

కీలక షెడ్యూల్‌ పూర్తి

- Advertisement -

అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. సూపర్‌ స్టార్‌ కృష్ణ మనవడు, మహేష్‌ బాబు సోదరుడి కుమారుడు జయ కృష్ణ ఘట్టమనేని ఈ సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నారు. అలాగే రవీనా టాండన్‌ కుమార్తె రాషా తడాని కూడా హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సీనియర్‌ కథానాయకుడు మోహన్‌ బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. నిర్మాత అశ్విని దత్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. పి.కిరణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్‌ రివీల్‌, ఆకట్టుకునే ఫస్ట్‌ లుక్‌ పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించాయి.

ఇటీవల చిత్రబృందం తిరుపతిలో జరిగిన కీలకమైన మూడో షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ షెడ్యూల్‌లో కృష్ణ ఘట్టమనేని, రాషా తడాని తదితర ప్రధాన తారాగణంపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌ పూర్తవడంతో సినిమా షూటింగ్‌ దాదాపు 60 శాతం పూర్తయింది అని చిత్రయూనిట్‌ తెలిపింది. ఈచిత్రానికి రచన-దర్శకత్వం: అజయ్ భూపతి, సమర్పణ: అశ్విని దత్‌, నిర్మాత: పి.కిరణ్‌, బ్యానర్‌: చందమామ కథలు, సంగీతం: జివి ప్రకాష్‌ కుమార్‌, డీఓపీ : జయకృష్ణ, ఎడిటర్‌: మాధవ్‌ కుమార్‌ గుళ్లపాటి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సాహి సురేష్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సాకమూరి నారాయణ స్వామి, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -