Saturday, March 7, 2026
E-PAPER
Homeసినిమా'డేవిడ్‌ రెడ్డి'లో ఉక్రెయిన్‌ నటి..

‘డేవిడ్‌ రెడ్డి’లో ఉక్రెయిన్‌ నటి..

- Advertisement -

హీరో మంచు మనోజ్‌ నటిస్తున్న కొత్త సినిమా ‘డేవిడ్‌ రెడ్డి’. వెల్వెట్‌ సోల్‌ మోషన్‌ పిక్చర్స్‌, ట్రూ రాడిక్స్‌ బ్యానర్స్‌ పై నల్లగంగుల వెంకట్‌ రెడ్డి, భరత్‌ మోటుకూరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్‌ హనుమ రెడ్డి యక్కంటి రూపొందిస్తున్నారు. బ్రిటీష్‌ కాలం నాటి బ్యాక్‌ డ్రాప్‌తో ఇంటెన్స్‌ యాక్షన్‌ డ్రామా కథతో భారీ పాన్‌ ఇండియా చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి క్రేజీ అప్డేట్‌ ఇచ్చారు మేకర్స్‌.

ఈ సినిమాలో హీరోయిన్‌గా అంతర్జాతీయ నటి (ఉక్రెయిన్‌) మారియా ర్యాబోషాప్కా నటిస్తోందని ప్రకటించారు. మంచు మనోజ్‌, మరియా ర్యాబోషాప్కా మధ్య మంచి కెమిస్ట్రీ ఉన్న సన్నివేశాలు ఆకట్టు కుంటాయని మేకర్స్‌ చెబుతున్నారు. బ్రిటీష్‌ సామ్రాజ్యానికి ఎదురు నిలిచిన ఒక యోధుడి తిరుగుబాటు కథగా రూపొందుతున్న ఈ చిత్రంలో మంచు మనోజ్‌ కొత్త అవతార్‌లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్‌ చేసిన గ్లింప్స్‌, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌కు హ్యూజ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమా మనోజ్‌కు ఒక మంచి కమ్‌ బ్యాక్‌ అవుతుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. 1897 నుంచి 1920 మధ్య బ్రిటీష్‌ పాలనా కాలాన్ని నేపథ్యంగా తీసుకుని ఈ సినిమాను మేకర్స్‌ నిర్మిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -