Saturday, March 7, 2026
E-PAPER
Homeసినిమాఉగాదికి 'ఉస్తాద్‌..'

ఉగాదికి ‘ఉస్తాద్‌..’

- Advertisement -

సినీ ప్రియులంతా అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా అనుకున్న దానికంటే ముందుగానే అలరించడానికి సిద్ధమైంది. ఈనెల 26న రావాల్సిన ఈ చిత్రాన్ని ఈనెల 19వ తేదీనే విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఉగాది, దాని తరువాత వరుసగా వచ్చే లాంగ్‌ వీకెండ్లు, దాదాపు రెండు వారాల పాటు ఉండే సెలవుల ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని మేకర్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

పవన్‌ కళ్యాణ్‌, దర్శకుడు హరీశ్‌ శంకర్‌ కలయికలో వస్తున్న మరో భారీ ఎంటర్‌టైనర్‌ ఇది. గతంలో ‘గబ్బర్‌ సింగ్‌’తో వీరు బాక్సాఫీస్‌ వద్ద చరిత్ర సృష్టించారు. ఆ మ్యాజిక్‌ను తిరిగి సృష్టించడానికి, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరిచిపోలేని థియేటర్‌ అనుభవాన్ని అందించడానికి ఈ ద్వయం సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ యలమంచిలి నిర్మిస్తున్నారు. శ్రీలీల, రాశిఖన్నా, పార్థిబన్‌ తదితరులు ఇందులో ఇతర ముఖ్యతారాగణం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -