– ప్రస్తుత టారీఫ్తో రూ.10,233కోట్ల ఆదాయం
– చార్జీల పెంపులేదు : సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఎన్పీడీసీఎల్ కంపెనీ 2026-27 ఆర్ధిక సంవత్సరానికి రూ.12,521 కోట్ల రెవెన్యూ లోటు తో రూ.22,754 కోట్లు మొత్తం సమగ్ర ఆదాయ ఆవశ్యకత ఆమోదించాలని సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండ లిని కోరారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్ లో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బహిరంగ విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ.. ప్రభుత్వ సబ్సిడీ కాకుండానే రూ.12,521 కోట్లు రెవెన్యూ లోటు ఉందన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదన లేదని స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీ ఎంచుకునే సంబంధిత ఎల్టీ, హెచ్‌టీ వినియోగదారులకు సాధారణ టారీఫ్ కంటే యూనిట్‌కు రూ.0.66 గ్రీన్ టారిఫ్ విధింపు కొనసాగిస్తున్నట్టు చెప్పారు. 2026-27 ఆర్ధిక సంవత్సరానికి ఓపెన్ యాక్సెస్ ఎనర్జీ మేరకు సంబంధిత వినియోగదారులకు వర్తించే ఎనర్జీ ఛార్జీలో 10 శాతం చొప్పున స్టాండ్ బై ఛార్జీల విధింపు కొనసాగిస్తున్నట్టు తెలిపారు. గ్రిడ్ మద్దతు ఛార్జీలు నెలకు రూ.18.50 కిలోవాట్ చొప్పున వసూలు చేయనున్నట్టు చెప్పారు. జీరో యాక్సి డెంట్ లక్ష్యంతో పనిచేస్తున్నట్టు చెప్పారు. భద్రతా చర్యల్లో భాగంగా నెట్‌వర్క్‌ను పరిదిద్దడం కోసం రూ.68.21 కోట్లతో ఏప్రిల్ 2025 నుంచి ఫిబ్రవరి 2026 వరకు 14,090 ఇంటర్మీడియట్ స్తంభాలు నిలబెట్టడం, 5,987 వంగిన స్తంభాలు సరి చేయడం, 7,060 దెబ్బతిన్న, తుప్పుపట్టిన స్తంభా లను మార్చడం, 23,941 లూస్ స్పాన్స్ను సరి దిద్దినట్టు చెప్పారు. 8 వేల డీటీఆర్‌లకు ఎర్త్‌ను పునరుద్ధరించినట్టు తెలిపారు.
ఛాంబర్ ఆఫ్ కామర్స్ వరంగల్ జిల్లా అధ్య క్షులు బొమ్మినేని రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యవ సాయాధారిత పరిశ్రమలపై విద్యుత్ భారాన్ని తగ్గిస్తే రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మేలు జరుగుతుందని అన్నారు. ఏడాదిలో కేవలం 3-4 నెలల పాటు మాత్రమే నడిచే పరిశ్రమలకు సర్ చార్జీల పెంపు వద్దని, మాగ్జిమమ్ డిమాండ్ చార్జీలు తగ్గించాలని, హెచ్‌టీ వినియోగదారులపై వేసిన పీనల్ ఛార్జీలను (ఆర్ అండ్ సీ నిబంధనల కింద) పూర్తిగా రద్దు చేయాలని కోరారు. దక్షిణ మధ్య రైల్వే డీఈఈ దీపేంద్ర మార్వర్ మాట్లా డుతూ రైల్వే హెచ్‌టీ 5ఏ పెంపు వల్ల ప్రయాణీ కులపై తీవ్ర భారం పడుతుందని అన్నారు. ఒడిశా, కేరళ, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల కంటే తెలంగాణలో టారీఫ్ అధికంగా ఉదని, దీన్ని ఎన్పీడీసీఎల్ అధికారులు సవరించాలని కమిషన్ ముందు ప్రతిపాదించారు. వరంగల్ గ్రానైట్ అసో సియేషన్ అధ్యక్షులు చక్రాధర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రానైట్ పరిశ్రమలకు 0.95 పవర్ ఫ్యాక్టర్‌ను మాత్రమే నిర్ణయించి పరిశ్రమలను ఆదుకోవాలని, కేవీఏఆర్‌హెచ్ అన్‌బ్లాకింగ్‌కు 6 నెలల మినహా యింపు ఇవ్వాలని కోరారు. లఘు ఉద్యోగ భారతి సభ్యులు తేల్జేరు సురేందర్ మాట్లాడుతూ లఘు పరిశ్రమలపై విధించిన రూ.1.50 నాన్ పీక్ అవర్ టారీఫ్తోపాటు జరిమాన విధింపును ఉపసంహ రించి లఘు పరిశ్రమలను ఆదుకోవాలన్నారు.
ఎన్పీడీసీఎల్లో రూ.12,521 రెవెన్యూ లోటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



