– నలుగురికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
– గచ్చిబౌలి బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ప్రాంగణంలో ఘటన
నవతెలంగాణ -మియాపూర్
భారీ హీలియం గ్యాస్ బెలూన్ పేలిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ప్రాంగణంలో శుక్రవారం ఉదయం జరిగింది. గచ్చిబౌలి ఎస్‌హెచ్‌ఓ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం.. హౌళీ పండుగ నేపథ్యంలో ‘రంగ్‌దేసి హోలీ ఈవెంట్’ కోసం రాహుల్ అనే నిర్వాహకుడు ఈ గ్యాస్ బెలూన్‌ను ఏర్పాటు చేశాడు. ఆ బెలూన్ బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్ ప్రాంగణానికి కొట్టుకొచ్చి ఇక్కడే పేలింది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడగా.. వీరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. నిర్లక్ష్యంగా బెలూన్ ఏర్పాటు చేసిన రాహుల్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్‌హెచ్‌ఓ తెలిపారు.
పేలిన హీలియం బబుల్ బెలూన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



