– ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు
– ఖమ్మం ఆస్పత్రికి తరలింపు
– ఇద్దరి పరిస్థితి విషమం
– ఇంటర్ పరీక్షలు రాసి వస్తుండగా నేలకొండపల్లి మండలం సింగారెడ్డిపాలెం వద్ద ఘటన
నవతెలంగాణ- నేలకొండపల్లి
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని సింగారెడ్డిపాలెం కొరటేనే గుట్ట మూలమలుపు వద్ద శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివపురం గ్రామానికి చెందిన ఎండ్రాతి విశాల్, జిల్లపల్లి జస్వంత్, కొంగర గ్రామానికి చెందిన పొట్ట ఆకాష్.. నేలకొండపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఇంటర్ పరీక్షల నేపథ్యంలో వీరు ముగ్గురు సింగారెడ్డిపాలెంలోని గురుకుల పాఠశాల, కళాశాల పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసి నేలకొండపల్లికి తమ బైకుపై వస్తున్నారు. నేలకొండపల్లిలోని గౌతమి జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు కోరట్లగూడెం గ్రామానికి చెందిన బచ్చలకూరి అభినవ్(జానీ), అమ్మగూడెం గ్రామానికి చెందిన వాసంశెట్టి ఉదరు, ఆరెగూడెం గ్రామానికి చెందిన బోయిన ఉదరు ముగ్గురు.. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రంలో పరీక్షలు రాసి నేలకొండపల్లి నుంచి వారి స్వగ్రామాలకు తమ బైకుపై వెళుతున్నారు. ఈ క్రమంలో సింగారెడ్డిపాలెం కొరటేనే గుట్టవద్దకు రాగానే కూసుమంచి వైపు నుంచి నేలకొండపల్లి వస్తున్న ఓ కారును తప్పించబోయి ప్రమాదవశాత్తు కారును ఢీ కొట్టి ఎదురుగా వస్తున్న బైకును కూడా వేగంగా ఢకొీట్టడంతో రెండు బైకులపై ఉన్న ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదాన్ని గమనించిన అటుగా వెళుతున్న వాహనదారులు వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేయడంతో గాయాలైన ఆరుగురు విద్యార్థులను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మండల వైద్యాధికారి డాక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో ప్రాథమిక చికిత్సలు అందించారు. అనంతరం స్థానిక వైద్యుల సలహా మేరకు ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఒకే ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ పి.సంతోష్, తహసీల్దార్ వి.వెంకటేశ్వర్లు, ఎంపీడీవో ఎం.ఎర్రయ్య తమ సిబ్బందితో ఆస్పత్రిని సందర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కారు, బైక్‌ను ఢీకొట్టిన బైకులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



