Saturday, March 7, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంన్యూ సైన్సు కాలేజీలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

న్యూ సైన్సు కాలేజీలో పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

- Advertisement -

పూర్వ విద్యార్థిగా హాజరైన తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్‌ కె. శ్రీనివాస్‌ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

హైదరాబాద్‌లోని రాంకోట్‌లో గల న్యూ సైన్సు కళాశాల బీఎస్సీ 1967 – 1970 బ్యాచ్‌ విద్యార్థులు 56 ఏండ్ల తర్వాత కలుసుకొని ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఫతేహ్ మైదాన్‌ క్లబ్‌లో శుక్రవారం న్యూ సైన్సు కాలేజ్‌ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. పూర్వవిద్యార్థిగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మెన్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. స్నేహం చిరకాలం నిలిచే బంధమని నిరూపించారు. 56 ఏండ్ల తర్వాత ఒక్కచోటకొచ్చి కలుసుకోవడంతో ఫతేV్‌ా మైదాన్‌ క్లబ్‌ భావోద్వేగ వేదికగా మారింది. తమ జీవిత అనుభవాలు, అనుభూతులను, తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఆనాటి గురువులను స్మరించుకున్నారు. తనతోపాటు చదువుకున్న కాలేజ్‌ మిత్రులను శ్రీనివాస్‌రెడ్డి ఆత్మీయంగా పలుకరించారు. పాత జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. తనతోపాటు చదువుకున్న తోటి విద్యార్థులు శాస్త్రవేత్తలుగా, ఇంజినీర్లుగా, వ్యాపార వేత్తలుగా సాధించిన తమ ప్రతిభను సమాజానికి అందేటట్టు కృషి చేయడం అభినందనీయమని కొనియాడారు. సమ్మేళనంలో పూర్వ విద్యార్థులు బీరెడ్డి శేఖర్‌ రెడ్డి, ఎమ్‌.మోహన్‌ రెడ్డి, ఎమ్‌. సత్యనారాయణ, పి.విజరు కుమార్‌, జి. జవహర్‌, జి.ఎన్‌.విజరు కుమార్‌ రెడ్డి, డాక్టర్‌ ఎస్‌.ఏం. మాసూమ్‌, పి. శ్రీనివాస్‌ గౌడ్‌, డి.వై. దినేష్‌, జీవీ కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -