శిక్షణలో అపశృతి
న్యూఢిల్లీ : అసోంలో గురువారం గల్లంతైన సుఖోయ్ యుద్ధ విమానం కుప్పకూలింది. అస్సాంలోని కర్బి అంగ్లాంగ్ జిల్లాలో సుఖోయ్-30 ఎంకేఐ ఫైటర్ జెట్ కూలిపోయిందని, ఇద్దరు పైలెట్లు మరణించారని ఐఏఎఫ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. శిక్షణా కార్యక్రమంలో ఉన్న ఈ యుద్ధ విమానం గురువారం జోర్హాట్ నుంచి సుమారు 60కి.మీ దూరంలో ఉన్న కర్బి అంగ్లాంగ్ ప్రాంతంలో గల్లంతైన సంగతి తెలిసిందే. ఈయుద్ధ విమానం కూలిపోయిందని భారత వైమానిక దళం ఆ ప్రకటనలో తెలిపింది. సుఖోయ్ -30 ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన స్వాడ్రాన్ లీడర్ అనుజ్ మరియు ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దురాగ్కర్‌లు మరణించినట్టు ఐఏఎఫ్ వెల్లడించింది. ఈ ఘటనపై ఐఏఎఫ్ సంతాపాన్ని వ్యక్త చేసింది. ఈ సమయంలో మృతుల కుటుంబానికి అండగా నిలుస్తామని పేర్కొంది.
కూలిన సుఖోయ్ ఇద్దరు పైలెట్లు మృతి
- Advertisement -
- Advertisement -


